- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రీ రిలీజ్‌కు సిద్ధమైన విక్రమార్కుడు.. ఎప్పుడంటే!
దిశ, సినిమా : మాస్ మహారాజ రవితేజ సినిమాల్లో చాలా మంది ఎక్కువగా ఇష్టపడే సినిమా ఏదైనా ఉన్నదా అంటే అది విక్రమార్కుడే. ఈ సినిమా అంటే చాలా మందికి ఇష్టం. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అనుష్క హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ విడుదలై ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లింది. రవితేజ కామెడీ, నటన, అనుష్క అందాలు, బ్రహ్మానందం జోక్స్ ఇవన్నీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలించింది. 2006 జూన్ 23న విడుదలై మంచి సక్సెస్ అందుకుంది.
ఇక ప్రస్తుతం చాలా సినిమాలు రీరిలిజై మళ్లీ హిట్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది సీనియర్, జూనియర్ హీరోల మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు రీ రిలీజ్ కాగా, రవితేజ విక్రమార్కుడు సినిమాను కూడా రీ రిలీజ్ చేయడానికి మూవీ టీ కసరత్తు చేస్తోంది. జూలై 27న సినిమాను రీ రిలీజ్ చేయడానికి చిత్ర బృదం రెడీ అయ్యింది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మాస్ మహారాజా ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతున్నారు. ఇక విక్రమార్కుడు సినిమా 18.95 కోట్ల షేర్ రాబట్టగా, కొనుగోలు దారులకు రూ.7 కోట్ల లాభాలను అందించినట్లు సమాచారం.