Tirumala News:భక్తులకు అలర్ట్.. శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?

by Jakkula Mamatha |
Tirumala News:భక్తులకు అలర్ట్.. శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామి వారి దర్శనం కోసం ప్రపంచ నలూమూలల నుంచి భక్తులు(Devotees) తరలివస్తారు. ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి భక్తులకు అలర్ట్‌. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.

నిన్న శ్రీవారిని 58,165 మంది భక్తులు దర్శించుకున్నారు. 20, 377 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 3.6 కోట్లుగా నమోదు అయింది. టీటీడీ(TTD) వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ ప్రకటన చేసింది. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో శ్రీవాణి దర్శన టికెట్లు లభ్యం అవుతాయి. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల కానున్నాయి.

Advertisement

Next Story