రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’పై విజయేంద్ర‌ప్రసాద్ కీలక అప్‌డేట్

by Sathputhe Rajesh |   ( Updated:2023-07-10 09:16:38.0  )
రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’పై విజయేంద్ర‌ప్రసాద్ కీలక అప్‌డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్‌పై ఆయన తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ కీ కామెంట్స్ చేశారు. రాజమౌళి మహాభారత ఇతిహాసం ఆధారంగా సినిమా తీయడం తన డ్రీమ్ అని ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో స్పష్టం చేశారు. అయితే ఇదే అంశంపై తాజాగా మాట్లాడిన విజేయేంద్రప్రసాద్ మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ ఒక అడ్వెంచర్ మూవీ అన్నారు. భారీ స్థాయిలో ఈ మూవీకి ప్లాన్ చేస్తున్నామన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు మించి ఈ సినిమా ఉంటుందన్నారు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబోలో ఆర్‌ఆర్‌ఆర్ 2 సీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నామన్నారు. ఈ సినిమాకు రాజమౌళి డైరెక్షన్ చేస్తారా లేక వేరే హాలీవుడ్ డైరెక్టర్ పని చేస్తారా అనేది ఇప్పుడే చెప్పలేను అన్నారు. అయితే మహేష్ బాబుతో రాజమౌళి సినిమా అయ్యాక రాజమౌలి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ స్టార్ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. భారతీయ కథలను ప్రపంచానికి చెప్పాలని, ‘మహాభారతం’ సినిమా తీస్తే పది భాగాలు పట్టొచ్చు అన్నారు.

Read More: నటిని దాండియా కర్రలతో కొట్టిన కొరియోగ్రాఫర్.. గుర్తుచేసుకుని ఏడ్చిన సోనాలి

Advertisement

Next Story