మహేష్-జక్కన్న మూవీ.. స్టోరీపై క్లారిటీ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్

by Hamsa |   ( Updated:2023-04-13 07:21:55.0  )
మహేష్-జక్కన్న మూవీ.. స్టోరీపై క్లారిటీ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా పూర్తయిన వెంటనే టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ రాజమౌళితో మూవీ తీయబోతున్నాడు మహేష్. తాజాగా తన సన్నిహితులతో ఓ సమావేశంలో పాల్గొన్న జక్కన తండ్రి విజయేంద్ర ప్రసాద్.. మహేష్ సినిమా కథ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ‘ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొదలైంది. ‘హనుమాన్’ కథ ఇన్స్పిరేషన్‌గా మహేష్ బాబు కోసం ఒక కథను రెడీ చేశాం. ఈతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ తరం పోకడలకు అనుగుణంగా కథను మార్చి రూపొందించాం. త్వరలో సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు షూటింగ్ కార్యక్రమాలు కూడా మొదలు పెడతాం’ అని తెలిపాడు.

ఇవి కూడా చదవండి:

ఎన్టీఆర్ ఇంట్లో నైట్ పార్టీ.. అథిదులు ఎవరో తెలుసా..?

Advertisement

Next Story