తెలుగు డబ్బింగ్ చెప్తున్న తమిళ స్టార్.. 'బీస్ట్'తోనే మొదలు..??

by Disha News Desk |
తెలుగు డబ్బింగ్ చెప్తున్న తమిళ స్టార్.. బీస్ట్తోనే మొదలు..??
X

తెలుగు డబ్బింగ్ చెప్తున్న తమిళ స్టార్.. 'బీస్ట్'తోనే మొదలు..?? తమిళ స్టార్ విజయ్ ఇళయతలపతి తన తెలుగు మార్కెట్‌పై దృష్టి పెట్టాడు. తెలుగులో మార్కెట్ పెంచుకోవాలని కసరత్తులు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే తన నెక్స్ట్‌ విజయ్66ను వంశీ పైడిపల్లితో ప్లాన్ చేశాడు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది. అయితే ప్రస్తుతం విజయ్ 'బీస్ట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ స్టేజ్‌లో ఉంది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ విజయ్ స్వతహా చెప్తున్నాడట. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకే విజయ్ ఈ ప్లాన్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు తెగ వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో విజయ్ తన తెలుగు మార్కెట్ పెంచుకుంటాడేమో చూడాలి.

Advertisement

Next Story