లైగర్' ప్రమోషన్స్‌కు స్లిప్పర్స్ ఎందుకు వేసుకుంటున్నాడో చెప్పిన హీరో

by sudharani |
లైగర్ ప్రమోషన్స్‌కు స్లిప్పర్స్ ఎందుకు వేసుకుంటున్నాడో చెప్పిన హీరో
X

దిశ, సినిమా : రౌడీ హీరో విజయ్ దేవరకొండ 'లైగర్' ప్రమోషన్స్ భారీగానే జరుగుతున్నాయి. ఈ పాన్ ఇండియా ఫిల్మ్‌ గురించి దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రమోట్ చేస్తున్న విజయ్.. ట్రైలర్ రిలీజ్ నుంచి ఇప్పటి వరకు ప్రతిచోట 'స్లిప్పర్స్' ధరిస్తూ తన సింప్లిసిటీ చూపిస్తున్నాడు. మరోవైపు అటెన్షన్ కోసమే ఇదంతా చేస్తున్నాడన్న విమర్శలు వినిపిస్తుండగా.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు హీరో. 'నాకు ఆ టైమ్‌లో ఏది నచ్చితే అది ధరిస్తాను. బ్రాండ్‌తో సంబంధం లేకుండా అన్ని రకాల వస్తువులను ఇష్టపడతాను. అంతేకాదు 30 రోజులు సినిమాను ప్రమోట్ చేయాలి. అందుకోసం ప్రతి రోజు షూస్, డ్రెస్ కొత్తగా ధరించాలి. వాటిని ట్రై చేసేందుకు కూడా టైమ్ పడుతుంది. అలా కాకుండా నేను ఈ మధ్య కొనుగోలు చేసిన చెప్పులు కంఫర్ట్‌గా ఉంటున్నాయి. రోజూ వేసుకోవచ్చు. అలాంటప్పుడు ఇవే బెస్ట్ కదా' అని వివరించాడు.

Advertisement

Next Story

Most Viewed