నా కోడలిగా చేసుకునే ప్రసక్తి లేదు: రష్మికపై మండిపడ్డ విజయ్ దేవరకొండ తల్లి

by Anjali |   ( Updated:2023-10-12 11:31:21.0  )
నా కోడలిగా చేసుకునే ప్రసక్తి లేదు: రష్మికపై మండిపడ్డ విజయ్ దేవరకొండ తల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక- రణబీర్ జంటగా రాబోతున్న తాజా చిత్రం ‘యానిమల్’. డిసెంబరు 1వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకు వంగ సందీప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. అమ్మాయే.. అని సాగే ఈ పాటలో రణబీర్ కపూర్, రష్మిక లిప్ కిస్సులతో రెచ్చిపోయారు. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ- రష్మిక గత కొద్ది రోజుల నుంచి రిలేషన్‌లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ సాంగ్ చూసిన విజయ్ ఫ్యాన్స్ అందరూ రష్మికపై మండిపడుతూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

అయితే తాజాగా విజయ్ తల్లి కూడా దీనిపై చాలా సీరియస్ అయిందని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు ఎంతో పద్ధతిగా ఉన్న రష్మిక.. కేవలం మా కుమారుడితో మాత్రమే అలా చేస్తుందనుకున్నాం. కానీ ఇప్పుడు పరాయి హీరోతో అలా చేయడం మాకు నచ్చట్లేదని.. తనపై ఉన్న ఇంప్రెషన్ కాస్త తగ్గిపోయిందని, కోడలిగా చేసుకునే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పిందట విజయ్ తల్లి. ఇది ఎంత వరకు వాస్తవమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed