- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
షాకింగ్ నిర్ణయం తీసుకున్న విజయ్ దేవరకొండ.. సెన్సేషనల్ మ్యాటర్ లీక్!
దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకున్నాడు. ఈ మూవీతోనే రౌడీ హీరో అని ట్యాగ్ వచ్చింది. తర్వాత గీతా గోవిందం, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, నోటా, టాక్సీవాలా, ఖుషి వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. తాజాగా ఈ రౌడీ హీరో తీసుకున్న నిర్ణయానికి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
ప్రస్తుతం ఈ హీరో దగ్గరకు డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. రీసెంట్ విజయ్ ను మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను అప్రోచ్ అయ్యాడట. తన సినిమాలో నటించమని రౌడీ హీరోను అడిగారట. బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయడానికి విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయం కాస్త బయటకు రావడంతో.. విజయ్ ఏమో టూ క్లాస్.. బోయపాటి ఎమో సో మాస్.. మరీ అలాంటి దర్శకుడితో క్లాస్ హీరో మూవీ అంటే ఎలా ఉంటుందో అంటూ అభిమానులు సోషల్ మీడియాలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
మరికొంతమంది ఈ హీరోలోని మాస్ యాంగిల్ బయట పడాలంటే బోయపాటి శ్రీను లాంటి దర్శకులతో మూవీ తీయాల్సిందే. ఇక ఒక్కొక్కడికి లుంగీలు ఊడిపోవాల్సిందే. అంటూ కామెంట్లు పెడుతున్నారు. విజయ్ దేవరకొండ-బోయపాటి శ్రీను కలయికలో సినిమా తెరకెక్కడం ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట జోరుగా చర్చించుకుంటున్నారు.