సెప్టెంబర్ 1న వస్తున్న ‘ఖుషీ’.. అందరి హృదయాలను హత్తుకుంటుందట

by sudharani |   ( Updated:2023-03-23 13:37:37.0  )
సెప్టెంబర్ 1న వస్తున్న ‘ఖుషీ’.. అందరి హృదయాలను హత్తుకుంటుందట
X

దిశ, సినిమా : విజయ్ దేవరకొండ, సమంత జంటగా వస్తున్న సినిమా ‘ఖుషీ’. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. కాగా ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సమంత మళ్లీ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మూవీ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్.

ఈ మేరకు సెప్టెంబర్ 1న చిత్రాన్ని తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయబోతున్నట్ల తెలిపారు. అంతేకాదు కశ్మీర్‌తో పాటు ఎన్నో అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుకున్న చిత్రంలో విజయ్, సమంతల కాంబినేషన్ ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకునేలా ఉంటుందన్నారు దర్శకనిర్మాతలు. అంతేకాదు మిడ్ మాన్ సూన్‌లో రెండు భిన్నమైన నేపథ్యాలతో రాబోతోన్న ఈ కథ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందనే ధీమా వ్యక్తం చేశారు.

Also Read...

అలా చేసి సమంతపై పగ తీర్చుకున్న నాగార్జున ?

Advertisement

Next Story

Most Viewed