నయనతార బర్త్‌డే.. ఒక రేంజ్‌లో ప్లాన్ చేసిన విఘ్నేష్

by Seetharam |   ( Updated:2022-11-09 13:58:04.0  )
నయనతార బర్త్‌డే.. ఒక రేంజ్‌లో ప్లాన్ చేసిన విఘ్నేష్
X

దిశ, సినిమా : కోలీవుడ్ స్టార్ కపుల్ న‌య‌న‌తార‌-విఘ్నేశ్ శివ‌న్.. ఇటీవలే సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.ఇక తాజా సమాచారం ప్రకారం ఈ నెల 18న నయన్ పుట్టినరోజు వేడుకలు జరగనున్నాయి. పెళ్లయ్యి, ఇద్దరు పిల్లలకు తల్లయిన తర్వాత నయనతారకు చేసుకోబోతున్న మొదటి పుట్టినరోజు కాబట్టి ఇది కొంచెం స్పెషల్ అని చెప్పొచ్చు.

దీంతో ఈ సెలబ్రేషన్స్ కోసం విఘ్నేష్ ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేయబోతున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది. కానీ ఆ రేంజ్‌లో ఏం చేయబోతున్నాడో మాత్రం టాప్ సీక్రెట్‌గా ఉంచాడు. మరి విఘ్నేష్ తన భార్యకు ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడో తెలియాలంటే నవంబర్ 18 వరకు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి :

'కాంతార' మూవీ క్లైమాక్స్ సీన్.. అదరగొట్టిన కమెడియన్ నూకరాజు

యాటిట్యూడ్ చూపిస్తున్న స్టార్ హీరోయిన్.. సినిమా నుంచి తీసేసిన డైరెక్టర్

Advertisement

Next Story