- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
JR NTR జాతకంలో ఆ దోషం ఉందంటూ.. మరో బాంబు పేల్చిన వేణుస్వామి
దిశ,సినిమా: సెలబ్రిటీలు జాతకాలు చెబుతూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఎంత ఫేమస్ అయ్యాడో మనకు తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో జూనియర్ ఎన్టీఆర్ జాతకంలో దోషం ఉందని చెప్పి సంచలనం సృష్టించారు. వేణు స్వామి చెప్పిన మాటలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. గతంలో వేణు స్వామి ఎన్టీఆర్ తల్లి శాలిని కలిశారట. ఎన్టీఆర్ పుట్టుక విషయంలో ఒక పెద్ద సమస్య ఉందని వేణు స్వామి తల్లి శాలినీకి వివరించారట.
ఎన్టీఆర్ కు ఉన్న దోషం గురించి పెద్ద ఎన్టీఆర్ తో పాటు శాలినీకి మాత్రమే తెలుసు, మూడో వ్యక్తికి ఎవరికి తెలియదు, అలాంటిది ఈ విషయం వేణు స్వామికి ఎలా తెలిసిందని ఎన్టీఆర్ తల్లి ప్రశ్నించిందట. నాకు అన్ని తెలుసు అని వేణు స్వామి సమాధానమిచ్చారట. అయితే ఆ సమస్య ఏంటో చెప్పలేదు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తప్పక వస్తారు.. కానీ ఇప్పుడే కాదు. 2030 వరకు ఆయన్ను రాజకీయాల్లోకి అడుగుపెట్టరు. ఆ తర్వాత వచ్చే అవకాశం ఉంది. తాత గారికి రాజయోగం ఎలా పట్టిందో, ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ కి కూడా అలాగే రాజయోగం పడుతుంది. జూ. ఎన్టీఆర్ జాతకంలో ముఖ్యమంత్రి అయ్యే యోగ్యం ఉందని, కానీ ఆయనకు ఆ దోషం ఉందని వేణు స్వామి తెలిపారు. అయితే ఆ దోషం గురించి చెప్పకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు భయపడుతున్నారు.
మీరు చెప్పేవాటిలో కొన్ని జరగలేదు కదా.. మరి వాటికి మీరు ఏమి చెబుతారు అని యాంకర్ ప్రశ్నించగా.. " నేను చెప్పిన వాటిలో 100 కు 98 శాతం జరిగాయి. నేను అందరీ జాతకాలు చెబుతాను.. నాకు ఎవరి మీద కోపం ఉండదు.. ఇంకా చెప్పాలంటే.. వాళ్ళు నా చుట్టాలు కూడా కాదు.. కావాలని నేను ఎందుకు చెబుతా.. అలా ఉంది.. అలా జరుగుతాయి కాబట్టి నేను చెబుతున్నా అంటూ" ట్రోలర్స్ కు ఘాటుగానే సమాధానమిచ్చారు.