Bigg Boss: ఓ చెత్త షో.. వెళ్తే జీవితాలు నాశనమవుతాయంటూ వేణు స్వామి సెన్సేషనల్ కామెంట్స్!

by Hamsa |
Bigg Boss: ఓ చెత్త షో.. వెళ్తే జీవితాలు నాశనమవుతాయంటూ వేణు స్వామి సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ, సినిమా: తెలుగు రియాలిటీ బిగ్‌బాస్ షోకు ఎంత ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగుతో పాటు అన్ని భాషల్లో సక్సెస్‌ ఫుల్‌గా సీజన్లను సీజన్లు పూర్తి చేసుకుంటున్నాయి. తెలుగులో ఇప్పటికే ఏకంగా 7 సీజన్లు పూర్తి అయిన సంగతి తెలిసిందే. అయితే తొందరలోనే బిగ్‌బాస్-8 సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఇటీవల దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. అక్కినేని నాగార్జున ఓ వీడియో షేర్ చేసి బిగ్‌బాస్ లోగోను రివీల్ చేశాడు.

అయితే ఇందులో ప్రముఖ అస్ట్రాలజర్ వేణు స్వామి కంటెస్టెంట్‌గా పాల్గొనబోతున్నారంటూ పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాగే ఆయన భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి బిగ్‌బాస్ షోపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

మీరు బిగ్‌బాస్ షోకు వెళ్తున్నారని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కదా మీరు వెళ్తున్నారా అని యాంకర్ అడగ్గా.. ‘‘ నేను బిగ్‌బాస్ షోకు వెళ్లడమా.. అదొక చెత్త షో నేను వెళ్లను. అయితే ఇందులోకి వెళ్లి విన్నర్‌గా నిలిచిన వారు రెచ్చిపోయి ప్రవర్తిస్తారు. సంవత్సరం పూర్తయ్యేసరికి మరో సీజన్ స్టార్ట్ అవుతుంది. దీనివల్ల కొంత ప్రయోజనం కూడా లేదు. నాకు ఇప్పటికే బిగ్‌బాస్ షోకు రమ్మని రెండుసార్లు ఆఫర్ వచ్చింది కానీ నేనే రిజెక్ట్ చేశాను. ఇక నేను ఆ షోలో ఎప్పటికీ అడుగు పెట్టను దానికి నేను పూర్తి వ్యతిరేకం. అక్కడికి వెళ్లి నేనేం చేస్తాను. ఆ బిగ్‌బాస్ షోకు వెళ్లడం వల్ల జీవితాలు నాశనం అవుతాయని నేనే అందరికీ చెప్తాను. అలాంటిది నేను ఆ షో కి వెళ్లడం ఏంటి’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వేణు స్వామి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



Next Story