- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూనియర్ NTR పుట్టుకలో దోషం.. ఆ ముగ్గురికి మాత్రమే తెలిసిన సీక్రెట్‌ను రివీల్ చేసిన వేణు స్వామి
దిశ, వెబ్‌డెస్క్: వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వివాదాలకు గురవుతుంటారు. ఆయన చెప్పిన జాతకాల్లో 100 కు 90 శాతం నిజం కావడంతో చాలా మంది వేణు స్వామిని నమ్ముతున్నారు. ఆయనతో పూజలు కూడా చేయించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి జూనియర్ ఎన్టీఆర్ పుట్టుకలో ఉన్న దోషం గురించి చెబుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఆయన మాట్లాడుతూ.. ‘తిరుమల శ్రీవారి సన్నిధిలో నేను, ఎన్టీఆర్ వాళ్ల అమ్మ షాలిని కూర్చుని మాట్లాడుకున్నాము. అప్పటికే ఎన్టీఆర్ జాతకాన్ని నేను చాలా సార్లు చెప్పాను. అయితే.. అప్పుడు ఆమె నన్ను ఒక ప్రశ్న అడిగారు. తారక్ పుట్టుక విషయంలో ఒక పెద్ద సమస్య ఉందని, ఆ దోషం తెలియకుండానే తారక్ జాతకం అంత కరెక్ట్‌గా ఎలా చెబుతున్నారని ఆమె నన్ను ప్రశ్నించారు. అప్పుడు నేను.. నాకు తెలుసు తల్లి అని తారక్‌కి ఉన్న పుట్టుక దోషం గురించి చెప్పాను. దీంతో ఆమె షాక్ అయ్యారు. నాకు, తారక్‌కి, పెద్ద ఎన్టీఆర్‌కు మాత్రమే తెలుసు. నాలుగో వ్యక్తికి ఈ విషయం తెలియదు. కానీ మీకు ఎలా తెలిసిందంటూ ఆమె ఆశ్చర్చపోయారు’ అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చాడు. అయితే.. ఆ దోషం ఏంటీ, దాని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అనేవి ఏది వేణు స్వామి చెప్పలేదు. కానీ, ఎన్టీఆర్‌కు రాజయోగం ఉందని పలు సందర్భాల్లో చెప్పిన వేణు స్వామి.. ఇప్పుడు ఆయన జాతకంలో దోషం ఉందంటూ చెప్పడంతో ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.
Also Read..