‘Pushpa-2’ రివ్యూ చెప్పిన Venu Swamy.. అసలు బన్నీ జాతకంలో ఏముందో తెలుసా?

by Hamsa |   ( Updated:2023-08-18 03:58:39.0  )
‘Pushpa-2’ రివ్యూ చెప్పిన Venu Swamy.. అసలు బన్నీ జాతకంలో ఏముందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల నిత్యం ఆయన పేరు సోషల్ మీడియా మార్మోగుతుంది. హీరో హీరోయిన్లతో పాటు రాజకీయ నాయకులకు సంబంధించిన వారి జాతకాలు చెబుతూ సంచలనం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రీటిల జాతకాలు చెప్పి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. నాగచైతన్య-సమంత పెళ్లి ముందే వాళ్లు విడాకులు తీసుకుంటారని చెప్పి అందరికీ షాకిచ్చాడు. వారు నిజంగానే విడిపోవడంతో అందరూ ఆయన జాతకాలను నమ్మడం మొదలు పెట్టారు. ఇలా ఎందరో సెలబ్రీటీల జీవితాల్లో జరిగే దాని గురించి ముందే చెబుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. కొంత మంది వేణు స్వామితో పరిహార పూజలు కూడా చేయించుకున్న సందర్భాలున్నాయి.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి ఓ స్టార్ హీరో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరో అల్లు అర్జున్ జాతకం ఎలా ఉందని యాంకర్ అడగ్గా.. దానికి వేణు స్వామి సమాధానమిస్తూ ‘‘ఆయన జాతకం అద్భుతంగా ఉంది. నిజం చెప్పాలంటే తెలుగులో అసలైన ప్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్. ఆయనపై ఒక్క రూపాయి పెడితే.. 10 రూపాయలు వస్తాయి. మరో పదేళ్ల వరకూ ఆయనకు ఎటువంటి ఢోకా లేదు. పుష్ప-2తో అల్లు అర్జున్ సంచలనాలు సృష్టించడం ఖాయం’’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Also Read: 'Khushi' సినిమా కోసం Vijay Deverakonda రెమ్యునరేషన్ అన్ని కోట్లు తీసుకున్నాడా?

Advertisement

Next Story

Most Viewed