సైలెంట్‌గా కూతురి పెళ్లి చేస్తున్న వెంకటేష్.. మెహందీ ఫొటోలు లీక్ చేసిన స్టార్ హీరో భార్య పోస్ట్ వైరల్!

by Hamsa |   ( Updated:2024-03-15 07:52:33.0  )
సైలెంట్‌గా కూతురి పెళ్లి చేస్తున్న వెంకటేష్.. మెహందీ ఫొటోలు లీక్ చేసిన స్టార్ హీరో భార్య  పోస్ట్ వైరల్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ ఇటీవల సైంధవ్ మూవీతో హిట్ అందుకున్నాడు. ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే కొత్త సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ఇదిలా ఉంటే.. వెంకటేష్ తన రెండో కూతురు హయవాహినికి గత ఏడాది ఓ డాక్టర్‌తో ఎంగేజ్‌మెంట్ జరిపించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి పెళ్లి ఎప్పుడనేది దగ్గుబాటి ఫ్యామిలీ ప్రకటించలేదు. దీనికి సంబంధించిన వివరాలు కూడా బయటకు రాలేదు. ఈ క్రమంలో తాజాగా, హయవాహిని పెళ్లి మార్చి 15న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరగనున్నట్లు సమాచారం. అయితే కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఈవెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. వాటికి సంబంధించిన ఫొటోలను కూడా దగ్గుబాటి ఫ్యామిలీ వారు బయటకు రానివ్వలేదు. ఈ నేపథ్యంలో ఒకప్పటి హీరోయిన్.. స్టార్ హీరో మహేష్ బాబు భార్య నమ్రత హయవాహిని మెహందీ ఫొటోలను ఇన్‌స్టా ద్వారా షేర్ చేసింది. ‘‘మెహందీ రాత్రి!! స్నేహితులు, కుటుంబ సభ్యులతో మంచి సమయాలు! ఈ అందమైన జంట జీవితకాలం ఆనందంగా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను’’ అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ వేడుకల్లో నమ్రత, సితార పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక అవి చూసిన వారు లవ్ సింబల్స్ ఉన్న బొమ్మలను షేర్ చేస్తున్నారు. అలాగే సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఆయనను కూడా ఈ వేడుకలకు తీసుకెళ్లవచ్చుగా అని కామెంట్లు చేస్తున్నారు.

Read More..

అతనితో నిశ్చితార్థం అయిన రెండు రోజులకే ఎమోషనల్ పోస్ట్ పెట్టిన హీరోయిన్


Advertisement

Next Story

Most Viewed