నెట్‌ఫ్లిక్స్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన వెంకటేష్.. వీడియో వైరల్

by Harish |   ( Updated:2023-02-14 08:26:20.0  )
నెట్‌ఫ్లిక్స్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన వెంకటేష్.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్, రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. సుపర్ణ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ హిందీ, తెలుగు భాషల్లో నెట్ ఫ్లిక్స్ వేదికగా త్వరలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ప్రారంభించిన వెంకీ నెట్ ఫ్లిక్స్‌కు వార్నింగ్ ఇస్తూ చేసిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


'బిగ్ మిస్టేక్ చేయకు నెట్ ఫ్లిక్స్. సిరీస్‌లో హీరో ఎవరు? నేనే. స్టార్ ఎవరు? అది కూడా నేనే. అందంగా కనిపించేది ఎవరు? నేనే. ఫ్యాన్స్ కూడా నా వాళ్లే. కాబట్టి ఈ షో పేరు కూడా నా పేరే ఉండాలి. నాగా నాయుడు అనే పేరుతో షో ఉండాలి. లేదంటే 'మజాక్ మజాక్‌ మే అబ్దుల్ రజాక్ హోజాతా'' అంటూ చేతిలో గన్‌తో సీరియస్‌ వార్నింగ్ ఇచ్చాడు. ఇక అమెరికన్ సిరీస్‌ను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రంలో సుచిత్ర పిళ్లై, గౌరవ్ చోప్రా, సుర్వీన్ చావ్లా కీలక పాత్రల్లో నటించారు.

ఇవి కూడా చదవండి: మహేష్‌కు ధీటుగా స్టార్ విలన్.. '#SSMB 28' నుంచి మరో బిగ్ అప్‌డేట్!



Advertisement

Next Story