Hero Venkatesh : లుంగీ లుక్ లో వెంకటేష్.. ఫొటో అదిరిందిగా

by Prasanna |
Hero Venkatesh :  లుంగీ లుక్ లో  వెంకటేష్.. ఫొటో అదిరిందిగా
X

దిశ, సినిమా : విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి 75వ మూవీగా సైంధవ్ తో మన ముందుకు వచ్చారు. మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతిని టార్గెట్ గా కొత్త మూవీకి సిద్ధమయ్యారు.

ఈ మూవీ దిల్ రాజు నిర్మాణంలో జరగనుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాకు సరికొత్తగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ని కూడా పెట్టినట్టు సమాచారం.

ఈసారి ఫుల్ యాక్షన్ కామెడీతో ప్రేక్షకులను ఎంటెర్టైన్ చేయడానికి వెంకటేష్ అనిల్ కాంబో సిద్ధమయ్యారు. అయితే, త్ తాజాగా ఈ మూవీ షూటింగ్లో వెంకీ జాయిన్ ఐనట్లు తెలుస్తుంది. దీనికి సంబందించిన మేకింగ్ వీడియోని విడుదల చేస్తూ వెంకటేష్ వచ్చేసాడు అంటూ ప్రకటించారు. ఈ వీడియోలో వెంకటేష్ లుంగీ లుక్ అదిరింది.. ఆ పంచ కట్టు చూస్తుంటే ఈ సారి ఎంటర్టైన్మెంట్ మాములుగా ఉండదు అన్నట్లు అర్ధమవుతుంది. దీంతో ఈ మూవీలో కూడా కామెడీ ఫుల్ గానే ఉంటుందని తెలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed