- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుష్ప సినిమా రికార్డు బ్రేక్ చేసిన 'వీర సింహారెడ్డి'!
దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'వీర సింహారెడ్డి'. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్‌తో నిర్మించగా.. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. బాలకృష్ణ కెరీర్‌లో 'వీరసింహారెడ్డి' ఎన్నో రికార్డులను తిరగరాసింది. తన కెరీర్‌లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
ఈ సినిమా విడుదలైన తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 54 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక తొలి రోజే తెలుగు రాష్ట్రాల్లో కూడా రూ. 25.36 కోట్లు వసూలు చేయగా.. అత్యధిక వసూళ్లు రాబట్టిన 15వ సినిమాగా నిలిచింది. అంతేకాక ఒక్క రోజులో తెలుగు రాష్ట్రాల్లో పుష్ప రూ. 24.90 కోట్లు వసూళ్లు రాబట్టగా.. దాన్ని బ్రేక్ చేసి సరికొత్త రికార్డు అందుకుంది. ఇక, ఒక్క రోజులో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన జాబితాలో ఆర్‌ఆర్‌ఆర్ తొలి స్థానంలో ఉండగా.. కేజీఎఫ్ రెండో స్థానంలో ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటించింది.