వెరైటీ కాన్సెప్ట్‌తో వరుణ్ తేజ్ లవ్ స్టోరీ.. మెగా ప్రిన్స్‌లో మార్పు స్టార్ట్ అయిందా?

by Javid Pasha |
వెరైటీ కాన్సెప్ట్‌తో వరుణ్ తేజ్ లవ్ స్టోరీ.. మెగా ప్రిన్స్‌లో మార్పు స్టార్ట్ అయిందా?
X

దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సీనీ ప్రేక్షకులందరికీ సుపరిచితమే. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ వంటి హ్యాట్రిక్ ఫ్లాపుల తర్వాత సినిమాలకు బాగానే గ్యాప్ ఇచ్చాడు. అయితే తన కెరీర్‌ను రీ స్టార్ట్ చేయాలనే గట్టి పట్టుదలతో ఇటీవల మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ప్రస్తుతం ‘మట్కా’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అంది వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలని భావిస్తు్న్నాడట వరుణ్. ఇందులో భాగంగానే ‘మట్కా’పూర్తి కాకముందే మరో ప్రాజెక్ట్‌ని లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.

రవితేజకి ‘టచ్ చేసి చూడు’ లాంటి డిజాస్టర్ మూవీ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ సిరికొండ కాంబోలో ఓ వెరైటీ కాన్సెప్ట్‌‌ లవ్ స్టోరీలో చేసేందుకు వరుణ్ తేజ్ రెడీగా ఉన్నాడట. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా దర్శకుడు విక్రమ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో అమెరికాలో జరిగిన ఓ ప్రేమ కథను రెడీ చేశాడట. మోడ్రన్ అండ్ ఫీల్ గుడ్ అంశాలు మిక్స్ అయి ఉండటంతో ఈ కథ విని వరుణ్ తేజ్ ఇంప్రెస్ అయ్యి.. మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం. ఇక దీనికి సంబంధించి బడ్జెట్, ఇతర నటీ నటుల గురించి పూర్తి వివరాలు త్వరలో దర్శకుడు వెల్లడించే అవకాశం ఉందట. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుండగా.. మెగా ప్రిన్స్‌ అప్డేట్ అవుతున్నాడు. మంచి మార్పు స్టార్ట్ అయిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. అదేంటో గానీ మెగా ప్రిన్స్‌కు అందరూ ఫ్లాప్ డైరెక్టర్లే దొరుకుతున్నారని కూడా మరి కొందరు రియాక్ట్ అవుతున్నారు.

Advertisement

Next Story