లావణ్య త్రిపాఠికి షాకిచ్చిన వరుణ్ తేజ్.. ఫేవరేట్ హీరోయిన్ ఎవరో చెప్పిన మెగా హీరో!

by Nagaya |   ( Updated:2024-02-07 15:04:10.0  )
లావణ్య త్రిపాఠికి షాకిచ్చిన వరుణ్ తేజ్.. ఫేవరేట్ హీరోయిన్ ఎవరో చెప్పిన మెగా హీరో!
X

దిశ, వెబ్‌డెస్క్: వరస సినిమాలతో దూసుకెళ్తున్న మెగా హీరో వరుణ్ తేజ్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. ఫిదా సినిమాతో మరింత క్రేజ్ పెంచుకున్న ఈ మెగా హీరోకు వరసగా మూవీ ఆఫర్లు తన్నుకు వచ్చాయి. ఈ క్రమంలోనే వరుణ్, లావణ్య త్రిపాఠి కలిసి నటించిన ‘మిస్టర్’ మూవీతో వారిద్దరు ప్రేమలో పడ్డారు. వాళ్ల లవ్ పుట్టిన ప్లేస్‌లోనే వరుణ్ లావణ్యకు ప్రపోజ్ చేశాడంటా. అంతేకాదు వాళ్ల మ్యారేజ్ కూడా ప్రపోజ్ చేసిన ఇటలీలోనే జరిగింది.

ఇది ఇలా ఉంటే మెగా ప్రిన్స్ తాజాగా నటిస్తున్న మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ త్వరలో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. వచ్చే నెల ఫస్ట్‌కు రిలీజ్ కాబోతున్నందున ఈ సినిమాలో ఒక సాంగ్ రిలీజ్ చేశారు. అయితే రీసెంట్‌గా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో సాంగ్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈవెంట్లో స్టూడెంట్ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానం చెప్పాడు వరుణ్. ఒక స్టూడెంట్ మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అని అడుగ్గా... నా ఫేవరెట్ హీరోయిన్ ఎవరో మీ అందరికీ తెలుసు.. ప్రస్తుతం మా ఇంట్లోనే ఉంది అని సమాధానం ఇచ్చాడు. లావణ్య కాకుండా ఇంకా వేరే ఎవరు ఇష్టం అంటూ మరో స్టూడెంట్ అడగడంతో ‘నా ఫెవరెట్ హీరోయిన్ సాయి పల్లవి’ అంటూ కుండబద్దలు కొట్టాడు. దీంతో స్టూడెంట్స్ అంతా షాక్ అయ్యారు. పెళ్లైనా మనసులో మరో అమ్మాయిని పెట్టుకున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story