కియారాను ముద్దు పెట్టుకున్న Varun Dhawan.. కోపంతో రగిలిపోతున్న బాయ్ ఫ్రెండ్

by sudharani |   ( Updated:2023-01-07 11:02:31.0  )
కియారాను ముద్దు పెట్టుకున్న Varun Dhawan.. కోపంతో రగిలిపోతున్న బాయ్ ఫ్రెండ్
X

దిశ, సినిమా: కియారా, వరుణ్ జంటగా వచ్చిన బాలీవుడ్ చిత్రం 'జగ్‌ జగ్ జీయో' . ఈ మూవీ ప్రమోషన్స్ టైమ్‌లో ఇద్దరూ కలిసి ఫోటో షూట్ కోసం పోజులిస్తుండగా.. వరుణ్ ఆమె చెంప పై ముద్దు పెట్టాడు. అయితే ఆ కిస్ ముందుగా ప్లాన్ చేయలేదని తెలుస్తుండగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కియారా బాయ్ ఫ్రెండ్ సిద్దార్థ్ మండిపోయాడు. అయితే, ఇదే విషయం పై ఆమెతో గొడవ పడ్డ సిద్దార్థ్.. వరుణ్‌పై కోపం పెంచుకున్నాడని తెలుస్తోంది.

సిద్ధార్థ్ కియారాతో చాలా సీరియస్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నందున ఈ ముద్దు సంఘటన వారి మధ్య గొడవలు సృష్టించకూడదని వరుణ్ భావించాడని, తన జోక్యంతో గొడవ సద్దుమణిగింది అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ జంట ఫిబ్రవరి మొదటి వారంలో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జైపూర్‌లోని సూర్యగఢ్ హోటల్‌ను నాలుగు రోజుల పాటు బుక్ చేసుకున్నట్లు సమాచారం. అతిథులు రెండు రోజుల ముందు అక్కడి చేరుకుని ఈ విలాసవంతమైన విల్లాలో బస చేయనున్నారు. ఆల్రెడీ షాపింగ్ కూడా కంప్లీట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed