డేట్‌కు వెళ్లిన Varun,Lavanya.. ఫొటోస్ వైరల్

by sudharani |   ( Updated:2023-07-19 14:09:31.0  )
డేట్‌కు వెళ్లిన Varun,Lavanya.. ఫొటోస్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ లేజ్, బ్యూటీఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకుని ఒక్కటైన విషయం తెలిసిందే. దాదాపుగా ఐదేళ్లు పాటు ప్రేమాయణం నడిపిన ఈ జంట.. ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో అనేక వార్తలు షికార్లు కొట్టాయి.

ఇక ఫైనల్‌గా నెట్టింట వచ్చిన వార్తలను నిజం చేస్తూ జూన్-9 న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే.. పెళ్లికి ఇంకాస్త సమయం ఉండటంతో డేటింగ్‌లకు వెళుతూ ఎంజాయ్ చేస్తున్నారు వరుణ్, లావణ్య. మొన్నటి వరకు ఇటలీలో సందడి చేసిన ఈ కపుల్స్.. తాజాగా కాఫీ డేట్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నేరుగా వారే తమ ఇన్‌స్టా స్టోరీస్‌లో ఒకరి ఫొటోను మరొకరు షేర్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed