- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమంతను పెళ్లికి ఆహ్వానించిన వరలక్ష్మీ శరత్ కుమార్.. కంగ్రాట్స్ డార్లింగ్ అంటూ పోస్ట్!
దిశ, సినిమా : నటి వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె హీరోయిన్‌గా తన కెరీర్ మొదలు పెట్టి ప్రస్తుతం నెగిటివ్ రోల్స్‌లో అదరగొడుతుంది. వచ్చిన ప్రతి ఆఫర్‌ను అందుకుంటూ తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే చాలా రోజుల నుంచి ఈమె పెళ్లికి సంబంధించిన వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వరలక్ష్మీ శరత్ కుమార్, థాయిలాండ్‌లో జూలై2న వివాహం చేసుకోబోతుంది. తన ప్రియుడు నికోలాయ్ సచ్ దేవ్ అనే వ్యక్తితో ఈ నటి ఏడు అడుగులు వేయడానికి రెడీ అయ్యింది. ప్రస్తుతం వరలక్ష్మీ తన పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఆమె తన వెడ్డి కార్డులు పంచుతూ.. తన వివాహానికి అతిథులని ఆహ్వానిస్తుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
సమంత లీడ్ రోల్ పోషించిన యశోధ సినిమా సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. అయితే ఆ సమయంలో సమంతతో ఈ నటికి మంచి స్నేహం ఏర్పడింది. దీంతో ఈ బ్యూటీ తాజాగా సమంతను తన వివాహ మహోత్సవానికి ఆహ్వానించింది. దానికి సంబంధించిన ఫోటోలను సామ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ.. కంగ్రాట్స్ డార్లింగ్ అంటూ విషెస్ తెలిపింది. ప్రస్తుతం దానికి సంబంధించిన పోస్టు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక సామ్‌కే కాకుండా హనుమాన్ డైరెక్టర్, హీరో రవితేజలను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగులో పలు సినిమాల్లో నటించింది. మరీ ముఖ్యంగా యశోదలో ఆమె పాత్రలో ఒదిగి పోయింది. ఆ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. అంతే కాకుండా హనుమాన్ మూవీలో కూడా ఈ బ్యూటీ తన నటనతో అదరగొట్టింది అనే చెప్పాలి.