‘డబుల్ ఇస్మార్ట్’లో త్రిఫుల్ రెమ్యూనరేషన్? భారీగా పెంచేసిన బేబీ హీరోయిన్!

by sudharani |   ( Updated:2023-08-02 16:47:02.0  )
‘డబుల్ ఇస్మార్ట్’లో త్రిఫుల్ రెమ్యూనరేషన్? భారీగా పెంచేసిన బేబీ హీరోయిన్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మూవీ ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ఒక్క సారిగా ఆ సినిమాలోని నటుల ఇమేజ్ పెరిగిపోయింది. అంతే కాకుండా.. ఈ చిత్రం అంతటి ఘన విజయం సాధించడానికి వైష్ణవి యాక్టింగ్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. హీరోయిన్‌గా వచ్చిన మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకోవడంతో అనేక ఆఫర్లు అమ్మడు చెంత చేరాయి.

ఈ క్రమంలోనే రామ్ పోతినేని హీరోగా వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. అయితే.. మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవి ఇప్పుడు రెండో సినిమాకు రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ‘బేబీ’ సినిమాకు కేవలం రూ. 30 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్న బ్యూటీ.. ఇప్పుడు ఏకంగా రూ. 80 లక్షలు డిమాండ్ చేస్తుందంటూ నెట్టింట టాక్ నడుస్తుంది. ‘డబుల్ ఇస్మార్ట్’ లో ఇద్దరు హీరోయిన్లు కాగా.. ఒక పాత్రలో వైష్ణవి అలరించనుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

Read More..

వీపుపై టాటూ చూపిస్తూ.. కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతోన్న జబర్దస్త్ నటి!

Advertisement

Next Story