మెగా హీరోను ముద్దులతో ముంచెత్తిన బ్యూటీ.. ట్రెండింగ్‌లో వీడియో

by Disha Newspaper Desk |
మెగా హీరోను ముద్దులతో ముంచెత్తిన బ్యూటీ.. ట్రెండింగ్‌లో వీడియో
X

దిశ, సినిమా: మొదటి సినిమా ఉప్పెన తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్.. ఆ తర్వాత కొండపొలంతోనూ మెప్పించాడు. ఈ క్రమంలోనే వైష్ణవ్ తన మూడవ చిత్రానికి సంబంధించి తాజాగా అప్‌డేట్ ఇచ్చాడు. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'రంగ రంగ వైభవంగా' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలిపిన ఆయన.. ఇందుకు సంబంధించిన టైటిల్ టీజర్‌ను షేర్ చేశాడు. 'ఏంటే ట్రీట్ ఇస్తానని చెప్పి చేతులు ఊపుకుంటూ వస్తున్నావ్' అని వైష్ణవ్ అడగగా.. 'అమ్మాయిలు ట్రీట్ ఇవ్వాలంటే ఏం తీసుకు రానక్కర్లేదు. నీకు బటర్ ఫ్లై కిస్ తెలుసా?' అంటూ హీరోయిన్ కేతిక శర్మ హీరో పెదాలపై చేతులు పెట్టడం తో ఈ టీజర్ ముగుస్తుంది. కాగా ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా.. దేవిశ్రీ స్వరాలు సమకూర్చుతున్నాడు.

https://www.youtube.com/watch?v=_6JZ7HJx2vI

Advertisement

Next Story