Uruku patela: గెట్ ఉరికిఫైడ్ ట్యాగ్ లైన్‌తో ‘ఉరుకు పటేల’ మూవీ నుంచి ఫస్ట్ లుక్..

by Kavitha |
Uruku patela: గెట్ ఉరికిఫైడ్ ట్యాగ్ లైన్‌తో ‘ఉరుకు పటేల’ మూవీ నుంచి ఫస్ట్ లుక్..
X

దిశ, సినిమా: ‘హుషారు’ వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన నటుడు తేజ‌స్ కంచ‌ర్ల‌ (Tejus Kancherla) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రసెంట్ ప్రేక్ష‌కుల‌కు మరింత ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తేజస్ ‘ఉరుకు పటేల’ (Uruku Patela) అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ‘గెట్ ఉరికిఫైడ్’ (Get Urikified) అనే ట్యాగ్‌లైన్‌తో మేకర్స్ ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. దీంతో పాటు మూవీ డీటైల్స్‌ను కూడా తెలియజేశారు.

ఇక ఈ పోస్ట‌ర్‌లో.. తేజ‌స్ కంచ‌ర్ల ప‌రిగెడుతుంటే అత‌ని వెనుక క‌త్తిని ఎవ‌రో విసిరేసిన‌ట్లు క‌నిపిస్తుంది. మ‌రో వైపు మంగ‌ళ‌సూత్రం, పోస్ట‌ల్ బ్యాలెట్ పేప‌ర్‌, పాల క్యాన్ అన్నీ క‌నిపిస్తున్నాయి. ఇది గ్రామీణ నేప‌థ్యంలో భావోద్వేగాల ప్ర‌ధానంగా సాగే చిత్ర‌మ‌ని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది.


Advertisement

Next Story