Urfi Javed:కళ్లు చెదిరిపోయే డిజిటల్ డిస్ ప్లే డ్రెస్‌లో దర్శనమిచ్చిన ఉర్ఫీ.. వీడియో వైరల్

by Anjali |   ( Updated:2024-07-28 07:40:49.0  )
Urfi Javed:కళ్లు చెదిరిపోయే డిజిటల్ డిస్ ప్లే డ్రెస్‌లో దర్శనమిచ్చిన ఉర్ఫీ.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తరచూ వింత వింత డ్రెస్సింగ్ స్టైల్స్‌తో ఫ్యాషన్ ప్రియులను అవాక్కయ్యేలా చేస్తుంటుంది. సోషల్ మీడియాను షేక్ చేసే వెరైటీ దుస్తులతో యువతను మెస్మరైజ్ చేస్తుంటుంది. స్టార్టింగ్‌లో ఈ భామ డ్రెస్సింగ్ స్టైల్‌పై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేయగా.. తర్వాత ఇదొక టాలెంట్ అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు.

టీవీ షోస్, సినిమా ఈవెంట్స్, అవార్డు వేడుకలకు ఉర్ఫీ జావేద్ అందరికి భిన్నంగా కొత్త రకం డ్రెస్ ధరించి హాజరవుతూ ఉంటుంది. రెండు నెలల కిందట ఈ బ్యూటీ మ్యాజికల్ బట్టర్ ఫ్రాక్ ధరించి.. సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయగా.. టాలీవుడ్ ముద్దగుమ్మలైన మృణాల్ ఠాకూర్, క్యూటీ సమంత, అనుపమ పరమేశ్వరన్ సైతం స్పందించిన విషయం తెలిసిందే. ఏకంగా ఉర్ఫీకి లవ్ అండ్ ఫైర్ సింబల్స్ రిప్లై ఇచ్చారు.

అయితే తాజాగా ఉర్పీ జావేద్ మరో కొత్త రకం డ్రెస్సింగ్ స్టైల్‌తో జనాలను ఆకట్టుకుంటోంది. బ్లాక్ టాప్ ధరించిన ఈ బ్యూటీ డ్రెస్‌పై డిజిటల్ డిస్ ప్లే రావడం జనాలను ఆశ్చర్చానికి గురి చేస్తుంది. ప్రస్తుతం ఉర్ఫీ జావేద్ డిజిటల్ డిస్ ప్లే డ్రెస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు సూపర్, న్యూ క్రియేటివిటీ అంటూ ఉర్ఫీ జావేద్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు

Advertisement

Next Story

Most Viewed