సారీ చెప్పిన ఉర్ఫీ.. ఇకపై అలాంటి డ్రెస్సింగ్‌లో కనిపించనంటూ కీలక నిర్ణయం

by Prasanna |   ( Updated:2023-04-01 07:26:05.0  )
సారీ చెప్పిన ఉర్ఫీ.. ఇకపై అలాంటి డ్రెస్సింగ్‌లో కనిపించనంటూ కీలక నిర్ణయం
X

దిశ, సినిమా: ఉర్ఫీ జావేద్ గురించి పరిచయం అక్కర్లేదు. వైవిధ్యమైన వస్త్రధారణతో, ఎక్స్‌పోజింగ్‌తో సోషల్ మీడియాలో దర్శనమిస్తూ యువతలో హీట్ పుట్టిస్తూ ఉంటుంది. ఆమె ఎక్స్‌పోజింగ్‌కు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతుంటారు. తాజాగా హీరోయిన్ కరీనా కపూర్ కూడా ఉర్ఫీ‌పై ప్రశంసలు కురిపించింది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తాజాగా ఉర్ఫీ స్పందిస్తూ తన బోల్డ్ డ్రెస్సింగ్‌వల్ల ఎవరైనా బాధపడుంటే గనుక వారికి సారీ చెప్తున్నానంటూ ట్వీట్ చేసింది. ‘‘నా డ్రెస్సింగ్ స్టయిల్ వల్ల వారి సెంటిమెంట్లు దెబ్బతింటున్నాయి. అలాంటి వారికి క్షమాపణలు చెబుతున్నా. ఇక నుంచి మారిపోయిన ఉర్ఫీ జావేద్‌ను మీరు చూస్తారు. క్షమించండి’’ అంటూ అందులో పేర్కొన్నది. దీంతో ఆమె అభిమానులు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటని ఆరా తీస్తున్నారు. ‘ మీకు నచ్చినవి ధరించండి.. లిబరెటెడ్‌గా ఉండండి’ అంటూ కామొంట్ చేస్తున్నారు.

Read more: ఓటీటీ సెన్సార్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. హద్దుమీరితే జరిగేదిదే?

పార్క్‌లో లవర్‌తో అలా చేస్తూ దొరికిపోయిన వర్ష.. షాక్‌లో జబర్దస్త్ టీం!

Advertisement

Next Story

Most Viewed