Kannappa: కన్నప్ప నుంచి కంపడు క్యారెక్టర్ రివీల్.. పోస్టర్‌తో అంచనాలను పెంచేస్తున్న మేకర్స్

by Hamsa |
Kannappa: కన్నప్ప నుంచి కంపడు క్యారెక్టర్ రివీల్.. పోస్టర్‌తో అంచనాలను పెంచేస్తున్న మేకర్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమాను ముకేష్ కుమార్‌సింగ్ తెరకెక్కుస్తుండగా.. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్యకంగా రాబోతున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. అయితే కన్నప్ప సినిమాలో మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్, మోహన్ బాబు, దేవరాజ్ వంటి స్టార్స్ నటిస్తున్నాడు. అయితే కన్నప్ప డిసెంబర్‌లో పాన్ ఇండియన్ చిత్రంగా వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతుంది.

ఈ క్రమంలో.. మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేస్తున్నారు. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన మధుబాల పన్నగ, దేవరాజ్ ముండడు, సంపత్ రామ్ చుండడు, వంటి పాత్రలకు సంబంధించిన పోస్టర్స్ విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా, కన్నప్ప మేకర్స్ రాఖీ పండుగ కావడంతో ముఖేష్ రిషి కంపడు పోస్టర్‌ను విడుదల చేశారు.

అంతేకాకుండా ఆయన పాత్రకు సంబంధించిన విషయాలు తెలిపారు. పుళిందులు అత్యంత పురాతనమైన జాతి. సదాశివ కొండల్లో నివసిస్తుంటారు. వంశపారం పర్శంగా.. పవిత్రమైన వాయు లింగాన్ని సంరక్షిస్తున్న ఈ పుళింద జాతీనికి భద్ర గణం అంటారు. భద్ర గణాన్ని నడిపించే నాయకుడే కంపడు’’ అని రాసుకొచ్చాడు. ప్రజెంట్ ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్ చూశాక ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఇందులో ఇంకా ఎంతమంది భాగమయ్యారో అనే ఆసక్తి నెలకొంది.

Advertisement

Next Story