నాకు చాలా నచ్చింది.. జర్నలిస్ట్ కావాలని ఉందంటూ మెగా కోడలు స్పెషల్ పోస్ట్..

by Hamsa |   ( Updated:2024-09-11 14:38:28.0  )
నాకు చాలా నచ్చింది.. జర్నలిస్ట్ కావాలని ఉందంటూ మెగా కోడలు స్పెషల్ పోస్ట్..
X

దిశ, సినిమా: మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన వ్యాపారవేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఆమె సినిమా ఇండస్ట్రీలోకి రానప్పటికీ స్టార్ హీరో హీరోయిన్‌కు మించిన క్రేజ్‌ను సంపాదించుకుంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఉపాసన ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. అంతేకాకుండా పలు విషయాలపై రియాక్ట్ అవుతూ ఆసక్తికర పోస్టులతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఉపాసన ఓ సిరీస్‌పై ప్రశంసలు కురిపిస్తూ ఇన్‌స్టా వేదికగా ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది.

‘‘అనన్య పాండే నటించిన ‘కాల్ మీ బే’ అనే సిరీస్ నేను లాస్ట్ నైట్ చూశాను. నాకు చాలా నచ్చింది. అది చూసిన తర్వాత నాకు సోషల్ మీడియా జర్నలిస్ట్ కావాలనిపిస్తుంది’’ అని రాసుకొచ్చింది. ప్రజెంట్ మెగా కోడలు పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా.. కాల్ మీ బే సీరిస్‌లో అనన్య పాండే ప్రధాన పాత్రలో నటించగా.. కొల్లిన్ డి కున్హా దర్శకత్వం వహించాడు. ప్రజెంట్ ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. దీంతో కాల్ మీ బే సీరిస్‌ను చూసిన పలువురు సినీ సెలబ్రిటీలు రివ్యూలు ఇస్తూ పోస్టులు షేర్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed