ఆ విషయంలో ఆడపడుచులను నిరాశపరిచిన ఉపాసన.. ఏం చేసిందంటే?

by samatah |   ( Updated:2023-06-24 14:01:26.0  )
ఆ విషయంలో ఆడపడుచులను నిరాశపరిచిన ఉపాసన.. ఏం చేసిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : పదేళ్ల తర్వాత చిరు చేతులోకి తన వారసురాలు వచ్చిన విషయం తెలిసిందే. తమ ఇష్టదైవమైన ఆంజనేయ స్వామి రోజు, మంగళవారం నాడు తన ఇంటి మహాలక్ష్మీ వచ్చిందని ఆ ఫ్యామిలీ అంత సంబరపడుతుంది.

కానీ, రామ్ చరణ్‌కు కొడుకు పుట్టాలని చిరు కూతుర్లు .. సుస్మిత, శ్రీజ కోరుకున్నారంట. ఓ ఇంటర్వ్యూలో సుస్మితను చెర్రీకి ఎవరు పుట్టాలి అనుకుంటున్నావు అని అడగ్గా.. అబ్బాయి పుట్టాలి అనుకుంటాన్నాను. కచ్చితంగా అబ్బాయే పుడుతాడు. ఎందుకంటే మా ఇంట్లో ఇప్పటికే నలుగురు అమ్మాయిలు ఉన్నారు. అబ్బాయి పుడితే చూడాలని ఉంది, తనను పెంచాలని ఉంది అంటూ చెప్పుకొచ్చిందంట. కానీ ఉపాసనకు అమ్మాయే పుట్టడంతో, ఉపాసన ఆడపడుచులు ఇద్దరు కూడా చాలా నిరాశ పడ్డారంట. వాళ్ళ సోదరుడుకి అబ్బాయి పుడితే వాళ్లే చాలా బాగా పెంచాలని ఎన్నో కలలు కన్నారంట. అలాంటిది మళ్లీ అమ్మాయి పుట్టడంతో ఆల్రెడీ నలుగురు అమ్మాయిలని పెంచి.. వీళ్లిద్దరూ బోర్ అవుతున్న టైంలో మళ్లీ అమ్మాయి పుట్టడంతో ఉపాసన మాకు హ్యాండ్ ఇచ్చింది అంటూ బాధపడుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed