- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాలెంటైన్స్ డే సందర్భంగా ఇంట్రెస్టింగ్ ఫొటో రివీల్ చేసిన ఉపాసన.. వైరలవుతోన్న లిటిల్ ఫ్యామిలీ పిక్!
దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి సుపరిచితమే. ఈ హీరో అపోలో ఆసుపత్రి చెర్మైన్ మనవరాలైన ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈమెకు సినీ పరిశ్రమతో సంబంధం లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అంతే కాకుండా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తనవంతు సాయం చేస్తుంటుంది. ఇదంతా పక్కన పెడితే..
రామ్ చరణ్-ఉపాసన దాదాపు 11 ఏళ్ల తర్వాత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ బుజ్జాయి రాకతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్నంటాయి. ఇక మెగా స్టార్ చిరంజీవి ఆనందానికైతే హద్దులు లేవని చెప్పుకోవచ్చు. క్లింకార అని నామకరణం చేసిన ఈ అమ్మడు ఫేస్ ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. ఫంక్షన్స్‌లో, వెకేషన్స్‌లో క్లింకారతో దిగిన ఫొటోలు ఫ్యాన్స్‌తో పంచుకున్నప్పటికీ మెగా ప్రిన్సెస్ ముఖం కనిపించకుండా ఎమోజీలతో కవర్ చేస్తున్నారు.
తాజాగా రామ్ చరణ్ సతీమణి వాలెంటైన్స్ డే సందర్భంగా తన ఫ్యాన్స్‌తో ఓ స్పెషల్ ఫొటో పంచుకుంది. రామ్ చరణ్, క్లింకార, ఉపాసన ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసి ఉన్న క్యూట్ పిక్.. లవ్ సింబల్ యాడ్ చేసి.. సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటో వీక్షించిన మెగా అభిమానులంతా లవ్ లీ కపుల్.. క్యూట్ లిటిల్ ఫ్యామిలీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఉపాసన పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.