అన్ స్టాపబుల్ షో అనధికారిక ప్రసారాలు ఆపివేయండి.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

by sudharani |   ( Updated:2022-12-30 10:53:43.0  )
అన్ స్టాపబుల్ షో అనధికారిక ప్రసారాలు ఆపివేయండి.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి నట సంహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో 'అన్ స్టాపబుల్'. 'ఆహా' లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో మొదటి సీజన్‌ను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో.. రెండో సీజన్‌లో అంచనాలకు మించి ఎంటర్‌టైన్మెంట్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్‌తో.. అప్ కమింగ్ పవన్ కళ్యాణ్‌తో షో చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్‌లు అధికారికంగా విడుదల కాకముందే.. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయి. దీంతో ఆహా బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ని ఆర్థికంగా దెబ్బతీస్తుంది.

ఈ క్రమంలో ఆహా సంస్థ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆహాకు మాత్రమే సొంతమైన అన్ స్టాపబుల్ ఎపిసోడ్స్ అనధికారిక ప్రసారాలు నిలిపివేయాలని.. వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ సచ్దేవ్ సంచలన ఆదేశాలు జారీచేశారు. అన్ స్టాపబుల్ ఎపిసోడ్‌కి సంబంధించి అనధికారంగా చేస్తున్న ప్రసారాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న లింకులు, వీడియోలు తొలగించాలని టెలీకమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖకు, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read more:

Unstoppable Season 2: ప్రభాస్ ఎపిసోడ్ పార్ట్‌వన్ టెలికాస్ట్‌‌కు టైం ఫిక్స్.

Prabhas ఫ్యాన్స్ దెబ్బకు ఆహా సైట్ క్రాష్..!

2023లో ప్రభాస్ అనారోగ్యం పాలవుతాడా..? వేణు స్వామి సంచలన కామెంట్స్

Advertisement

Next Story