'అన్ స్టాపబుల్: సీజన్2': తాజా ఎపిసోడ్‌కు ఆ నలుగురు

by Hamsa |   ( Updated:2022-11-29 09:27:36.0  )
అన్ స్టాపబుల్: సీజన్2: తాజా ఎపిసోడ్‌కు ఆ నలుగురు
X

దిశ, సినిమా: 'అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' సీజన్2 లేటెస్ట్ ఏపిసోడ్‌‌కు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. ఈసారి ఏకంగా నలుగురు గెస్ట్‌లతో బాలయ్య సందడి చేయనున్నాడు. ఇక వచ్చేవారిలో ఇద్దరు లెజెండరీ డైరెక్టర్లు, మరో ఇద్దరు స్టార్ నిర్మాతలు హాజరు కాబోతుండగా ప్రేక్షకులు పండగ చేసుకోనున్నారు. ఈ మేరకు అల్లు అరవింద్, సురేష్ బాబు, రాఘవేంద్ర రావు, కళాతపస్వి కె విశ్వనాథ్ అతిథిలుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఎల్లప్పుడూ ఇంటర్వ్యూ‌లకి దూరంగా ఉండే కె. విశ్వనాథ్ 'అన్ స్టాపబుల్' షో‌కి రాబోతుండడం విశేషం.

ఇవి కూడా చదవండి : 'ఠెహర్ జా' ప్రజల హృదయాలను గెలుచుకుంది: Palak Muchhal

Advertisement

Next Story