ప్రముఖ సింగర్‌తో ఉదిత్ రిలేషన్‌.. వారి బంధాన్ని నేను అంగీకరిస్తున్నానంటూ భార్య దీప షాకింగ్ కామెంట్స్!

by Disha Web Desk 6 |
ప్రముఖ సింగర్‌తో ఉదిత్ రిలేషన్‌.. వారి బంధాన్ని నేను అంగీకరిస్తున్నానంటూ భార్య దీప షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: ప్లే బ్యాక్ సింగర్ ఉదిత్ నారాయణ అందరికీ సుపరిచితమే. ఆయన పలు హిందీ పాటలు పాడి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా ఏకంగా 34 లాక్వెజెస్‌లో తన పాటలతో మెప్పించాడు. అయితే ముఖ్యంగా ఉదిత్ సింగర్ అల్కా కలిసి పాడిన పాటలు ఎక్కువగా హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందంటూ పలు పుకార్లు షికారు చేశాయి. కానీ దీనిపై వీరిద్దరు స్పందించకపోవడంతో ఇప్పటికీ పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా, ఉదిత్ తన భార్య దీపతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

ఇందులో యాంకర్ దీపను ఉదిత్-అల్కా రిలేషన్ గురించి మీరు ఏం అనుకుంటున్నారని అడగ్గా.. దానికి దీప స్పందిస్తూ.. ఉదిత్, అల్కా సంబంధాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే వారిద్దరి మధ్య మంచి స్నేహం బంధం ఉందని నాకు తెలుసు. కాబట్టి వారి మీద నాకు నమ్మకం ఉంది. ఏన్నో ఏళ్ల నుంచి మచ్చలేకుండా వారి ప్రయాణం సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంది. మేము అందరం ఒకే కుటుంబంలా ఉంటాం. అందుకే ఎన్ని రూమర్స్ వచ్చినా మా రెండు కుటుంబాలు కలిసే ఉంటున్నాయి.

అయితే వారి బంధం గురించి ఎవరెన్ని అనుకున్నా అవి ఇంటి బయట వరకే. ఇంట్లో నేను ఉదిత్ చాలా సంతోషంగా ఉంటాం. అయితే మహిళలు ఒకటి పెట్టుకుంటే ఎలాంటి గొడవలు రావు. భర్తలకు కూడా స్నేహితులు ఉంటారని గుర్తుపెట్టుకుంటే.. దంపతుల మధ్య గొడవలకు తావు ఉండదు. నాకు అది తెలుసు కాబట్టి నా భర్తతో నాకు ఎలాంటి గొడవలు లేకుండా జీవనం కొనసాగిస్తున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story

Most Viewed