UAE: గోల్డెన్ వీసా అందుకున్న మరో టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్

by sudharani |
UAE: గోల్డెన్ వీసా అందుకున్న మరో టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్
X

దిశ, సినిమా: గోల్డెన్ వీసా.. దీంతో దుబాయ్‌లో పదేళ్లపాటు ఎలాంటి పరిమితులు లేకుండా నివాసించవచ్చు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన కొందరు ప్రముఖులను, సినీ తారలను దుబాయ్ ప్రభుత్వం ఇలా గోల్డెన్ వీసాతో సత్కరిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఈ వీసా టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన అందుకోగా.. తాజాగా మరో టాలీవుడ్ హీరో దక్కించుకున్నారు. ఆయన మరేవరో కాదు.. మా అధ్యక్షుడు మంచు విష్ణు.

ఆర్ట్స్ అండ్ కల్చర్‌కు మంచు విష్ణు చేసిన సేవలను గుర్తిస్తూ అబుదాబిలోని సాంస్కృతిక & పర్యాటన శాఖ ప్రతిష్టాత్మక యుపైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) గోల్డెన్ వీసాను ఆయనకు మంజూరు చేశారు. ఇందులో భాగంగా ఆ వీసాను మంచు విష్ణు చేతులకు అందజేశారు సదరు అధికారులు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. ‘యుపైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) గోల్డెన్ వీసాను అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story