'777 చార్లీ' ట్విట్టర్ రివ్యూ.. థియేటర్‌లో ప్రేక్షకుల కంటతడి

by Sathputhe Rajesh |   ( Updated:2022-06-10 07:08:48.0  )
777 చార్లీ ట్విట్టర్ రివ్యూ.. థియేటర్‌లో ప్రేక్షకుల కంటతడి
X

దిశ, సినిమా : కన్నడ హీరో రక్షిత్ శెట్టి, ఓ కుక్కతో కలిసి నటించిన '777 చార్లీ' మూవీ ఈ రోజు(జూన్ 10) విడుదలైంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజైన ఈ చిత్రానికి కరణ్‌రాజ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ట్రైలర్‌తోనే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన మూవీపై ప్రేక్షకుల్లో పాజిటివ్ ఒపీనియనగ్ ఉండగా. ప్రస్తుతం థియేటర్స్‌లో సినిమా చూసిన చాలామంది నెటిజన్స్ సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేశారు.

ఈ చిత్రం చాలా ఎమోషనల్‌గా ఉందని, కొన్ని సీన్స్ చూస్తుంటే ఒక మూగజీవి ప్రేమ నిజంగా ఇంత స్వచ్ఛంగా ఉంటుందా? అనిపించిందని వెల్లడించారు. సినిమా చూస్తున్నపుడు కన్నీళ్లు ఆగలేదని.. వారిద్దరి మధ్య వచ్చే సీన్స్, కెమిస్ట్రీ ప్రతీ ఒక్కరి మనసును తాకుతుందని ట్విట్టర్ వేదికగా తెలియచేశారు. ఇక ఈ సినిమాతోనే రక్షిత్‌ శెట్టి పాన్ ఇండియా యాక్టర్‌గా అరంగేట్రం చేయగా.. ఇందులోని ఎమోషనల్ సీన్స్‌ను ఫీల్ అవ్వాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే.



Advertisement

Next Story

Most Viewed