నేను ఇబ్బంది పడినా వేరే వాళ్ళతో అలా చేయమంటాడు.. భర్త ఎలాంటి వాడో చెప్పిన బుల్లితెర నటి!

by Hamsa |   ( Updated:2024-03-16 15:26:40.0  )
నేను ఇబ్బంది పడినా వేరే వాళ్ళతో అలా చేయమంటాడు.. భర్త ఎలాంటి వాడో చెప్పిన బుల్లితెర నటి!
X

దిశ, సినిమా: బుల్లితెర నటి సునంద పలు సీరియల్స్‌లో విలన్‌గా నటించి మెప్పించింది. అలాగే మహారణి అనే ఓ షోలో విన్నర్‌గా కప్ కూడా గెలుచుకుంది. అయితే సునంద ముద్దమందారం సీరియల్ ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక కొద్ది రోజులు పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి అన్నింటికి దూరమైంది. ఇటీవల ప్రేమ ఎంత మధురం సీరియల్‌లో విలన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా అనేక టీవీ షోలల్లో పాల్గొంటూ సందడి చేస్తుంది. అలాగే ఢీ సెలబ్రిటీస్ షోలో తన డాన్స్‌తో అందరినీ మెప్పిస్తుంది.

ఇదిలా ఉండగా.. తాజాగా, సునంద తన భర్త క్యారెక్టర్ ఎలాంటిదో చెప్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నాకు నా భర్త చాలా సపోర్ట్ చేస్తాడు. నాకు డ్యాన్స్ ఇష్టం ఉండటం వల్ల పలు షోస్‌లో పాల్గొంటున్నాను. ఈ క్రమంలో నేను ఇంకొకరితో డాన్స్ చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేస్తున్నాడు. అయితే డాన్స్ చేస్తున్నప్పుడు మా ఆయన చూస్తే బాగోదని నేను ఇబ్బంది పడుతున్నాను. కానీ ఆయన మాత్రం ఇది నీ వృత్తి అని చెప్తూ ఫ్రీడమ్ ఇస్తున్నాడు. ఇలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఇలాంటి భర్త దొరుకుతాడు’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సునంద కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా ఈ విషయం తెలిసిన వారు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Read More..

ఆ భయం నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది.. అందుకే అలా చేశాను: సమంత

Advertisement

Next Story