వేదికపై జుట్టు కత్తిరించుకున్న స్టార్ సింగర్.. యాంటీ హిజాబ్ అంటూ

by Hamsa |
వేదికపై జుట్టు కత్తిరించుకున్న స్టార్ సింగర్.. యాంటీ హిజాబ్ అంటూ
X

దిశ, సినిమా : టర్కిష్ గాయని మెలెక్ మోస్సో.. ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక నిరసనలకు తమ సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు ఇరాన్ నిరసనకారులకు సంఘీభావంగా వేదికపై తన జుట్టును కత్తిరించుకోగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సెప్టెంబరు 17న కఠినమైన హిజాబ్ నిబంధనలను అమలు చేస్తూ పోలీసులు అరెస్ట్ చేసిన 22 ఏళ్ల మహాసా అమిని మరణించడంతో ఇరాన్‌లో అల్లర్లు చెలరేగాయి. ఆమె మరణించి పది రోజులవుతుండగా.. ప్రజల నిరసనలు గ్రామాలు, పట్టణాలతో కలిపి 46 ప్రాంతాలకు వ్యాపించాయి. ఈ క్రమంలో భద్రతా దళాలతో పోరాడి ఇప్పటికే 75 మందికి పైగా మరణించారని మానవ హక్కుల సంఘం పేర్కొంది.

దేశంలో అమలవుతున్న కఠినమైన దుస్తుల నియమావళికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు మహిళలు తమ జుట్టును కత్తిరించుకోవడం, హిజాబ్‌ను తీసివేసి, నిప్పు పెట్టడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తనవంతు సంఘీభావం తెలిపిన మెలెక్.. కఠినమైన దుస్తుల కోడ్, ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు పొడవాటి జుట్టు, వదులుగా ఉండే దుస్తులను ధరించాలని కొత్త చట్టాన్ని అమలు చేస్తున్న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇలా చేసినట్లు తెలిపింది.

Also Read: ఆ వీడియో చూస్తే దు:ఖం తన్నుకొస్తుంది.. నా కుంటుబాన్ని కాపాడండి

Advertisement

Next Story

Most Viewed