మరో ఆదిపురుష్ తీశారా ఏంటి?.. ప్రాజెక్ట్‌-Kలో ప్రభాస్‌ లుక్‌పై మళ్లీ ట్రోల్స్!

by sudharani |   ( Updated:2023-07-19 15:19:51.0  )
మరో ఆదిపురుష్ తీశారా ఏంటి?.. ప్రాజెక్ట్‌-Kలో ప్రభాస్‌ లుక్‌పై మళ్లీ ట్రోల్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా ‘ప్రాజెక్ట్-కే’. ఆదిపురుష్ సినిమా డిజాస్టర్‌గా నిలవడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్-కే సినిమాపైనే ఆశలన్నీ పెంచుకొని ఎంతో ఆత్రుతగా ఎదురుచుస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, ఫస్ట్ లుక్ మూవీపై అంచనాలు పెంచగా.. మరికొందరిని అసహనానికి గురిచేసింది. దీంతో మరోసారి ప్రభాస్ లుక్‌పై కూడా నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి. మేకర్స్ అఫీషియల్‌గా రిలీజ్ చేసిన లుక్‌ను నమ్మలేకపోతున్నారు. అది ఫేక్ అని, ఫ్యాన్ మేడ్ అంటూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు. ‘ప్రభాస్ తలను ఎవరి శరీరానికో అతికించినట్లుగా ఉందని.. ఇదేం లుక్‌రా బాబు’,, ‘ఇంకో ఆదిపురుష్ చేస్తారా ఏంటీ?’ అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story