త్రిష రాజకీయాల్లోకి రావడం లేదు : తల్లి ఉమ

by sudharani |
త్రిష రాజకీయాల్లోకి రావడం లేదు : తల్లి ఉమ
X

దిశ, సినిమా : తెలుగు ప్రేక్షకులక పరిచయం అక్కర్లేని పేరు త్రిష. దశాబ్ద కాలానికి పైగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఆమె త్వరలోనే రాజ‌కీయాల్లోకి వెళ్లనుందంటూ ఇటీవల కొన్ని వార్తలు సోష‌ల్ మీడియాలో చ‌క్కర్లు కొట్టాయి. నిజానికి త‌మిళ‌నాట సినీ స్టార్స్ రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టడం సాధార‌ణ విష‌యమే. అలాగే త్రిష కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని, ప్రముఖ కోలీవుడ్ హీరో విజ‌య్ ఆమెకు స‌పోర్ట్ చేస్తున్నాడ‌నే న్యూస్ ఓ రేంజ్‌లో హ‌ల్ చ‌ల్ చేసింది.

అయితే త్రిష తల్లి ఉమా కృష్ణన్‌ రీసెంట్‌గా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం త్రిష ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని, పలు భాషల్లో ప్రాజెక్టులు చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చింది. మరోవైపు త్రిష కూడా స్పందిస్తూ 'అస‌లు ఇలాంటి త‌ప్పుడు వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో తెలియ‌డం లేదు. నాకు రాజ‌కీయాల్లో చేరాల‌న్న ఆలోచ‌నే లేదు' అని సమాధానమిచ్చినట్లు సమాచారం.

Advertisement

Next Story