రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసిన త్రిష

by sudharani |   ( Updated:2023-11-16 13:51:21.0  )
రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసిన త్రిష
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎక్కురోజులు కొనసాగడం అంటే అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే హీరోలకు ఉన్నంత డిమాండ్ హీరోయిన్లకు ఉండదు. కానీ కొంత మంది మాత్రం ఎన్నేళ్లు అయినా ఇండస్ర్టీలో స్టార్ హీరోయిన్‌గా ఉండిపోతారు. అలాంటి వారిలో త్రిష ఒకరు. సౌత్‌లో రెండు దశాబ్దాలుగా టాప్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నా.. ప్రజెంట్ మాత్రం వరుస పాన్ ఇండియా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది.

ప్రస్తుతం ఈ భామ చేతిలో కమల్, మణిరత్నం సినిమాతో పాటు అజిత్ హీరోగా నటిస్తున్న ‘విడా ముయార్చి’ చిత్రం కూడా ఉంది. అయితే ఇప్పుడున్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవాలని త్రిష గట్టిగా ఫిక్స్ అయిందట. అందుకే మొన్నటి దాకా రెండు నుంచి మూడు కోట్లు తీసుకున్న ఆమె.. ఇప్పుడు ఏకంగా రూ.10 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట. ఈ కారణంగానే చిరంజీవి, బాలయ్య సినిమాల్లో అవకాశాలు మిస్ చేసుకున్నట్లుగా టాక్ వినపడుతుంది.

Advertisement

Next Story