Tripti Dimri : పెళ్లి పీటలెక్కబోతున్న యానిమల్ బ్యూటీ!.. వరుడు ఎవరంటే?

by Kavitha |   ( Updated:2024-08-09 07:25:57.0  )
Tripti Dimri : పెళ్లి పీటలెక్కబోతున్న యానిమల్ బ్యూటీ!.. వరుడు ఎవరంటే?
X

దిశ, సినిమా: ‘యానిమల్’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ అందరికీ సుపరిచితమే. తన ఫస్ట్ మూవీతోనే ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా రీసెంట్‌గా ‘బ్యాడ్ న్యూస్’ అనే మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతుంది. అలాగే టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తం కూడా నటిస్తూ తన అంద చందాలతో నేషనల్ క్రష్ బిరుదును కైవసం చేసుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ పెళ్లికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో భాగంగా ఈ బ్యూటీ ఫ్యాన్స్ హార్ట్‌లను బ్రేక్ చేస్తూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి రిలేషన్ చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతుందట. ఇక ఆయన ఎవరో కాదు ప్రముఖ బిజినెస్ మాన్ సామ్ మర్చంట్.. చాలామంది సెలెబ్రెటీలకు సామ్ మర్చంట్‌తో అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. అయితే గత కొద్ది సంవత్సరాలుగా సామ్ మర్చంట్‌తో త్రిప్తి డిమ్రీ ప్రేమలో ఉందని.. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే చాలా రోజుల నుండి వీరిద్దరూ పార్టీలు, ఫంక్షన్లు, వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేస్తూ వారి మధ్య ఉన్న బంధాన్ని అందరికీ తెలిసేలా చేస్తున్నారు. అంతే కాదు ఈ మధ్యకాలంలో పబ్లిక్‌గా సామ్ మర్చంట్‌తో త్రిప్తి డిమ్రీ ముంబై వీధుల్లో చాలాసార్లు మీడియా కంట కూడా పడింది. దీంతో త్వరలోనే వీరి పెళ్లి జరగబోతున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Advertisement

Next Story