మెగా ఫ్యామిలీకి పట్టపగలే చుక్కలు చూపిస్తున్న నిహారిక.. కోరుకున్నది ఇవ్వలేక.. కంట్రోల్ చేయలేక..

by Sujitha Rachapalli |   ( Updated:2024-04-16 06:11:35.0  )
మెగా ఫ్యామిలీకి పట్టపగలే చుక్కలు చూపిస్తున్న నిహారిక.. కోరుకున్నది ఇవ్వలేక.. కంట్రోల్ చేయలేక..
X

దిశ, సినిమా : నటుడు, నిర్మాత నాగబాబు కూతురు నిహారిక మెగా డాటర్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ మెగా ఫ్యాన్స్ దీన్ని వ్యతిరేకించారు. మా అభిమాన హీరో చిరంజీవి కుటుంబం నుంచి ఒక అమ్మాయిని హీరోయిన్‌గా ఊహించుకోలేమని, ఆమె స్క్రీన్‌పై అందాల ఆరబోత చేయడం సరికాదని వాదించారు. ఇంట్లో ఉన్న హీరోలు కూడా నిహారికను సపోర్ట్ చేయలేదు. ప్రమోట్ చేయలేదు. అందుకే ఆమె నటించిన సినిమాలేవీ కూడా అంతగా సక్సెస్ కాలేకపోయాయి. దీంతో నాన్నకు ఇచ్చిన మాట ప్రకారం ఆమె పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.

కానీ మనసులో తాను హీరోయిన్‌గా సక్సెస్ కావాలన్న బర్నింగ్ ఎయిమ్ వెంటాడుతుండటంతో ప్రయత్నాలు చేయగా అత్తింటి వారు ఒప్పుకోలేదు. ఫలితంగా విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. మొత్తానికి మళ్లీ సింగిల్ అయిపోయిన బ్యూటీ.. ఆఫర్స్ కోసం బోల్డ్ ఫొటో షూట్స్ చేయడం మొదలెట్టింది. ఓటీటీ కంటెంట్‌పై కాన్సంట్రేట్ చేస్తూ నిర్మాతగా, నటిగా ట్రై చేస్తుంది. అటు కోలీవుడ్‌లోనూ ఆఫర్స్ అందుకుంటుంది. అయినా సరే మెగా ఫ్యామిలీ నుంచి ఆమెకు సపోర్ట్ చేసేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేకపోతున్నారు. ఫ్యామిలీ మెంబర్‌గా ఆమెను ముద్దు చేస్తున్నారు కానీ నటిగా వెండితెరపై కనిపించేందుకు మాత్రం ససేమిరా అన్నట్లే కనిపిస్తుంది. అలాగని నిహారికను కంట్రోల్ చేయగలుగుతున్నారా అంటే అది లేదు.

Advertisement

Next Story

Most Viewed