చిరంజీవి ‘భోళాశంకర్’ సినిమాలో టాలీవుడ్ హీరో..!

by Hamsa |
చిరంజీవి ‘భోళాశంకర్’ సినిమాలో టాలీవుడ్ హీరో..!
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్‌లో ‘భోళా శంకర్’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చిరంజీవికి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. ఈ మూవీ ఏప్రిల్ 14న థియేటర్స్‌లో విడుదల కానుంది. తాజాగా, ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. కీర్తి సురేష్‌కు ప్రియుడిగా నటించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మార్చి 18న సుశాంత పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా సుశాంత్ వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed