పొట్టోడు అంటూ రామ్ చరణ్‌ను అవమానించిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్?

by samatah |   ( Updated:2023-03-27 11:00:14.0  )
పొట్టోడు అంటూ రామ్ చరణ్‌ను అవమానించిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్?
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగా హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్న చెర్రీ, మగధీర సినిమాతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ కెరీర్ ఆయన ఊహించని విధంగా మలుపు తిరిగిందని చెప్పవచ్చు. అంతే కాకుండా ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన కాజల్ కూడా మంచి ఫేమ్ సంపాదించుకొని, స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది.

ఇక ఈ రోజు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రామ్ చరణ్‌ని పొట్టోడా అంటూ అవమానించిందంట. ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఒకప్పటి స్టార్ హీరోయిన్ అనుష్క గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోద్ది ఈ ముద్దుగుమ్మ. అయితే రామ్ చరణ్ రెండో సినిమా మగధీరలో మిత్రవింద పాత్రలో మొదటగా రాజమౌళి, అనుష్కను అనుకున్నారట. తనను ఆ పాత్ర చేయమని అడిగాడంట. దానికి స్వీటి శెట్టి సమాధానం ఇస్తూ..రామ్ చరణ్ తనకంటే పొట్టిగా ఉంటాడని,ఆ సినిమాలో హీరో హీరోయిన్ గా చేస్తే మేమిద్దరం అక్కా తమ్ముడులాగా కనిపిస్తామని, ఆ సినిమా బాగుండదు అంటూ చెప్పడంతో రాజమౌళి అనుష్కని రిజెక్ట్ చేసి కాజల్ ని హీరోయిన్ గా తీసుకున్నారట.దీంతో రామ్ చరణ్ అభిమానులు అనుష్కపై మండిపడుతున్నారు. మా అభిమాన హీరోను పొట్టోడా అంటవా అని తిట్టిపోస్తున్నారు.

Read more:

రామ్ చరణ్ మరెంతో ఎదగాలి.. పవన్ కళ్యాణ్ ట్వీట్ వైరల్

మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ గేమ్ చేంజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్ రీలీజ్

Advertisement

Next Story