టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్ (పోస్ట్)

by Hamsa |   ( Updated:2024-09-04 14:24:05.0  )
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్ (పోస్ట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గత కొద్ది రోజుల నుంచి పూర్తిగా సినిమాలకు దూరం అయిన సంగతి తెలిసిందే. మయోసైటీస్ వ్యాధి బారిన పడటంతో చికిత్స తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటుంది. ఓ పాడ్ కాస్ట్ మొదలెట్టి అందులో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడా తెలుపుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలపై రియాక్ట్ అవుతోంది.

ఇటీవల మలయాళ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై హేమ కమిటీని వేసినట్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటిది వేయాలని ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని (Revanth Reddy) కోరుతూ పోస్ట్ పెట్టడంతో అంతా ఆశ్చర్యపోయారు. సామ్ మాత్రం నిత్యం కాస్టింగ్ కౌచ్‌పై ఏదో ఒక పోస్ట్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. తాజాగా, సమంత (Samantha) ఇన్‌స్టా ద్వారా గాయం అయినట్లు ఓ ఫొటోను షేర్ చేసింది. ‘‘గాయాలు లేకుండా నేను యాక్షన్ స్టార్ కాగలనా’’ అనే క్యాప్షన్ జత చేసి నీడిల్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లుగా తెలిపింది.

కానీ ఎప్పుడు గాయం అయింది.. ఏ సినిమా షూటింగ్‌లో జరిగిందో తెలపలేదు. ప్రజెంట్ ఈ అమ్మడు పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా అయ్యే సమంతకు ఏమైందని ఆందోళన చెందుతున్నారు. కాగా, సమంత (Samantha) ఇటీవల నటించిన ‘సిటాడెల్ హనీ బన్నీ’ (Citadel Honey Bunny) సిరీస్ నవంబర్ 7న నుంచి అమెజాన్ ప్రైమ్‌ (Amazon Prime) లో అందుబాటులోకి రానుంది. ఇందులో వరుణ్ ధావన్ Varun Dhawan హీరోగా నటించగా.. హిందీతో పాటు అన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. అయితే సమంత అభిమానుల కోరిక మేరకు సినిమాల్లో రీఎంట్రీ ఇస్తానని బంగారం పేరుతో చేస్తున్న ప్రాజెక్ట్ ప్రకటించింది. కానీ దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed