MEGASTAR CHIRANJEEVI: చిరంజీవిని దారుణంగా అవమానించిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. తీవ్ర ఆగ్రహానికి గురవుతోన్న మెగా ఫ్యాన్స్

by Anjali |
MEGASTAR CHIRANJEEVI: చిరంజీవిని దారుణంగా అవమానించిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. తీవ్ర ఆగ్రహానికి గురవుతోన్న మెగా ఫ్యాన్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ జూనియర్ సావిత్రిగా పేరు సంపాదించుకున్న నటి కీర్తీ సురేశ్ గురించి స్పెషల్‌గా చెప్పుకోనవసరం లేదు. అందం, అభినయం, నటనతో యువత గుండెల్ని కొల్లగొడుతోంది. కీర్తి సురేశ్ కేవలం తెలుగు చిత్రాల్లో మాత్రమే కాకుండా మలయాళం, తెలుగు తమిళ మూవీల్లో కూడా నటించి ప్రేక్షకుల మెప్పు పొందుతుంది. ఈ అమ్మడు ఏ ముహూర్తాన అడుగుపెట్టిందో తెలియదు కానీ.. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలక్ట్ చేసుకుంటూ అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో చోటు దక్కించుకుంది.

అగ్ర హీరోలైన మెగాస్టార్ చిరంజీవి అండ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు చెల్లెలిగా ఎమోషనల్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల హార్ట్‌ మెల్ట్ చేసింది. కీర్తి సురేష్ ప్రస్తుతం ‘ఉప్పు కప్పురంగు’ అనే టైటిల్‌లో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తోంది.అలాగే ‘రఘుతాత’ అనే మూవీల కూడా నటిస్తోంది. రీసెంట్ గా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. 15 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యే ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా జూనియర్ సావిత్రి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా కీర్తి ట్రోలింగ్‌కు కూడా గురవుతుంది. అయితే ఈ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి కంటే దళపతి విజయ్ చాలా బాగా డాన్స్ చేస్తారని చెప్పింది. కీర్తి సమాధానానికి నెట్టింట మెగా ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు. టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరోనే తక్కువ చేసి మాట్లాడుతావా? ఇది మెగాస్టార్ ను దారుణంగా అవమానించినట్లేనంటూ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story