- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mahesh Babu: ఇది కచ్చితంగా చూడాల్సిన సినిమా.. ‘రాయన్’పై టాలీవుడ్ స్టార్ హీరో రివ్యూ
దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా ‘రాయన్’. పూర్తి గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఈ చిత్రం భారీ అంచనాల మధ్య తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో జూలై 26న థియేటర్లలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతూ తాజాగా బ్రేక్ ఈవెన్‌కు కూడా చేరువైనట్లు తెలుస్తుంది. దీంతో మూవీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలోనే ఇప్పటికే నటుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ లారెన్స్ దీనిపై రివ్యూ ఇవ్వగా.. తాజాగా స్టార్ హీరో మహేశ్ బాబు సైతం ప్రశంసలు కురిపించాడు.
ఈ మేరకు ‘అద్భుతమైన డైరెక్షన్‌తో పాటు మంచి నటనతో ధనుష్ అదరగొట్టాడు. ఎస్‌జే సూర్య, ప్రకాశ్ రాజ్, సందీప్ కిషన్‌లు కూడా చాలా బాగా నటించారు. మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం మరో అద్భుతం. రాయన్ కచ్చితంగా అందరూ చాడాల్సిన సినిమా, చిత్రబృందానికి నా శుభాకాంక్షలు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మహేశ్ బాబు పోస్ట్‌పై ధనుష్ స్పందిస్తూ.. ‘మీ ప్రశంసలతో మా టీమ్ ఆశ్చర్యానికి లోనైంది. మీ ఆత్మీయతకు చాలా ధన్యవాదాలు’ అంటూ రిప్లై ఇచ్చాడు. అలాగే.. సందీప్ కిషన్, ఎస్‌జే సూర్య, అపర్ణ బాలమురళీ కూడా రియాక్ట్ అవుతూ మహేశ్ బాబుకి ‘థాంక్యూ’ చెప్పారు.