అవన్నీ సెలబ్రిటీల స్టంట్స్ అంటూ కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపెట్టిన టాలీవుడ్ హీరోయిన్!

by Hamsa |   ( Updated:2024-02-20 07:42:04.0  )
అవన్నీ సెలబ్రిటీల స్టంట్స్ అంటూ కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపెట్టిన టాలీవుడ్ హీరోయిన్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి ఒకప్పుడు స్టార్ హీరోల చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాకుండా కొంతకాలంపాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరమైంది. కొన్ని రోజులకు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి పలు షోస్‌తో అభిమానులకు దగ్గరైంది.

ఇక గత ఏడాది నాగచైతన్య కస్టడీ చిత్రం ప్రియమణి రీ ఎంట్రీ ఇచ్చి తన నటనతో అందరినీ మెప్పించింది. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ మరోసారి ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. తాజాగా, ప్రియమణి ఓ పాడ్ కాస్ట్‌లో పాల్గొన్న ఆమె సంచలన నిజాలు బయటపెట్టింది. ‘‘ ఈ విషయం ఇంతవరకు బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు.

ఇది ఎక్కువగా ముంబైలో జరుగుతుంది. సెలబ్రిటీలు జిమ్ము, ఎయిర్‌పోర్ట్‌లో కనిపించగానే ఫొటోగ్రాఫర్లు వస్తారని అందరూ అనుకుంటారు. ఓపెన్‌గా చెప్తున్నా.. వారిని ముందుగానే ఆరెంజ్ చేస్తారు. ఎంత మంది కావాలి? ఏ టైమ్‌కు కావాలి.. జిమ్ , ఎయిర్‌పోర్ట్ ఇలా ప్లేస్‌లు ఫిక్స్ అయ్యాక వారు ఆ టైమ్‌కు వస్తారు. ఇక వారిని ఆరెంజ్ చేసే పాప్రాజీ అనే వ్యక్తి అదంతా అయిపోయాక వారికి డబ్బులు ఇస్తాడు’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియమణి కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇన్ని రోజులు వారే వస్తారనుకుని మోస పోయామని అంటున్నారు.

Read More..

నాగార్జున హీరోయిన్‌పై ట్రోల్స్.. సిగ్గుండాలంటూ ఒక్క పోస్ట్‌తో స్ట్రాంగ్‌గా ఇచ్చి పడేసిన బ్యూటీ

Advertisement

Next Story